ఆమనగల్లులో సహకార వారోత్సవాలకు శ్రీకారం..

ఆమనగల్లు, ఆంధ్రప్రభ : సహకార వారోత్సవాల సందర్భంగా సోమవారం ఆమనగల్లు పట్టణంలోని సింగిల్ విండో (పీఏసీఎస్) కార్యాలయంలో చైర్మన్ గంప వెంకటేష్ ఆధ్వర్యంలో వారోత్సవాలను ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా పీఏసీఎస్ కార్యాలయం ఎదుట వారోత్సవాల జెండాను పాలకవర్గ సభ్యులతో కలిసి గంప వెంకటేష్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “సహకారం ద్వారా శ్రేయస్సు” అనే లక్ష్యంతో వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సహకార సంఘాలను సంఘటిత శక్తితో మరింత బలోపేతం చేస్తూ రైతు సభ్యుల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. భారతదేశ అభివృద్ధికి సహకార సంఘాలు బలమైన పునాదిగా నిలుస్తున్నాయని, వాటి బలోపేతానికి తమవంతు కృషి కొనసాగుతుందని పేర్కొన్నారు. అనంతరం సభ్యులతో ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ దోనాదుల సత్యం, డైరెక్టర్లు చేగురి వెంకటేష్, బేలి వెంకటేష్, శ్రీపాల్, దోల్యా, జంగమ్మ, జోగు వీరయ్య, రమేష్, సీఈఓ పద్మాకర్ రెడ్డి, డీసీఓ సీనియర్ ఇన్‌స్పెక్టర్ అమీర్ ఖాన్, సురేష్, మహేష్, సిబ్బంది అల్లాజీ, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.