కొత్త బైపాస్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. వృద్ధుడు దుర్మరణం
ఆదోని, ఆంధ్రప్రభ: ఆదోని పట్టణ శివారులోని ఆలూరు–ఎమ్మిగనూరు రోడ్లను కలిపే కొత్త బైపాస్ రోడ్డుపై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో విక్టోరియాపేటకు చెందిన పాండురంగ (70) అక్కడికక్కడే మృతి చెందాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాండురంగ పొలాలకు వెళ్లి స్కూటర్‌పై ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో ఆలూరు రోడ్డువైపు నుంచి కొత్త బైపాస్ రోడ్డుపైకి ఎక్కుతుండగా, ఆలూరు వైపు నుంచి వేగంగా వస్తున్న స్కార్పియో వాహనం స్కూటర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పాండురంగ తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే మృతిచెందాడు.
సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
