సకాలంలో వర్షాలు కురవాలని గ్రామదేవతలకు జలాభిషేకం..
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : సకాలంలో వర్షాలు కురిసి రైతులకు సమృద్ధిగా పంటలు పండాలని కోరుతూ గొల్ల–కురుమ సంఘం ఆధ్వర్యంలో మహిళలు ఆదివారం బీరన్న గుడి, గ్రామదేవతలకు ప్రత్యేక జలాభిషేకం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ లావణ్య మాట్లాడుతూ, మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు, గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని గ్రామదేవతలను ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోడిశాల రాజు, యాదవ సంఘం అధ్యక్షుడు పాక రమేష్, గోపు బిక్షపతి, కడారి రవి, కడారి వెంకన్న, కుమారస్వామి, నడిగే చేరాలు, కూర రాజ్‌కుమార్, గొల్ల–కురుమ సంఘం అధ్యక్షుడు అల్లి సమ్మయ్య, కోరే బిక్షపతి, అల్లి బిక్షపతి, కడారి సురేందర్‌తో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
