పోలియో రహిత సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలి..

  • సర్పంచ్ మునిగడప లావణ్య

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : పోలియో రహితసమాజ నిర్మాణానికి అందరు కృషి చేయాలని సర్పంచ్ మునిగడప లావణ్య అన్నారు. మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులు ఆశ కార్యకర్తలు అంగన్వాడి సిబ్బంది ఆరోగ్య సిబ్బంది సహకారంతో విజయవంతంగా నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పల్స్ పోలియో కార్యక్రమంన్ని సర్పంచ్ లావణ్య ప్రారంభించారు. పుట్టిన పిల్లలు నుండి ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలను వేయడం జరిగిందని అన్నారు. మన గ్రామాన్ని ఆరోగ్యవంతమైన గ్రామంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైద్యాధికారి డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో రహిత సమాజ నిర్మాణానికి మనమందరం సహకరించాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గొడిశాల రాజు, వైద్య అధికారులు, సూపర్వైజర్లు, ఆరోగ్య సిబ్బంది, ఏఎన్ఎంలు ఆశ కార్యకర్తలు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.