నిండు జీవితానికి రెండు చుక్కలు..
- పల్స్ పోలియో కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : ప్రతి ఐదేళ్ల లోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని అందోల్ జోగిపేట మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం జోగిపేటలోని ఏరియా ఆసుపత్రిలో చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దామని, అందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పోలియో చుక్కలు వేసుకోని వారికి ఈ నెల 29, 30 తేదీల్లో కూడా ఇంటింటికి సిబ్బంది వచ్చి చుక్కలు వేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చిట్టిబాబు, 21వ వార్డు కౌన్సిలర్ గడ్డి అరుణ, వైద్యులు పాల్గొన్నారు.
