పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలి

పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలి

కడెం, ఆంధ్రప్రభ : 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని కడెం మండలంలోని పెద్దూర్ కడెం గ్రామ సర్పంచ్ దీకొండ విజయ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన కడెం ప్రభుత్వ ఆసుపత్రిలో సర్పంచ్ దీకొండ విజయ్ కుమార్ పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలియో చుక్కల ద్వారా పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరిగి, భవిష్యత్తులో అంగవైకల్యం బారిన పడకుండా రక్షణ లభిస్తుందని తెలిపారు.

పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివకుమార్, ఉప సర్పంచ్ పిట్టల రాజన్న, అంగన్వాడీ టీచర్లు బాలమణి, జ్యోతి, ఆశా వర్కర్ రాపర్తి పార్వతి ఆసుపత్రి వైద్య సిబ్బంది, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.