monsoon | పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్

monsoon | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు మరింత ఉద్ధృతమయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. ఈ నెల 27 నుంచి 29 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.

ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. అదే సమయంలో రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉండగా, ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. రైతులు, మత్స్యకారులు, వాహనదారులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచించారు.