మంగళగిరిలో టీడీపీ క్యాడర్ శిక్షణ కార్యక్రమం

కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన కొలుసు పార్థసారథి

మంగళగిరి, ఆంధ్రప్రభ: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ క్యాడర్ శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న కార్యకర్తలకు ఆయన సర్టిఫికెట్లు అందజేశారు.

ఈ సందర్భంగా కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలపై కార్యకర్తలకు మరింత అవగాహన కల్పించేందుకు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలిపారు. శిక్షణ ద్వారా పొందిన జ్ఞానంతో ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా వెళ్లి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు.

టీడీపీని మరింత బలోపేతం చేస్తూ, ప్రజలకు మరింత చేరువగా పనిచేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో క్యాడర్ పాత్ర కీలకమని పేర్కొన్నారు.