సర్ ఇంటింటికి సర్వేకు సహకరించాలి..
జైనూర్, ఆంధ్రప్రభ : సర్ ఓటర్ జాబితా సవరణ సర్వే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని జండగూడ సర్పంచ్ ఉయిక చందన్ షాప్ కోరారు. ఆయన శనివారం జండగూడ పంచాయతీలో జరిగిన సర్ కార్యక్రమం సర్వేలో ఆయన పాల్గొని ప్రజలకు సర్వేపై ఓటర్ సవరణ వివరాలను అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటర్ జాబితాలో నమోదు కోసమే ఈ సర్వే చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సర్వేలో బిఎల్ఓ,నాయకులు ప్రజలు పాల్గొన్నారు.
