స్టీరింగ్ పట్టిన కలెక్టర్!
కర్నూల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ: కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్ట్‌లో సీఎం పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్‌లో ఏర్పాటు చేసిన భారీ వాహన డ్రైవింగ్ సిమ్యులేటర్‌ను ఆమె స్వయంగా నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు.
జిల్లా కలెక్టర్‌గా పరిపాలనా బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్న డాక్టర్ సిరికి డ్రైవింగ్‌లో కూడా మంచి పట్టు ఉందని ఈ సందర్భంగా స్పష్టమైంది. స్టీరింగ్ పట్టుకుని ఎంతో ఆత్మవిశ్వాసంతో వాహనాన్ని నడిపిన ఆమెను అధికారులు, సిబ్బంది అభినందించారు. అక్కడున్న వారందరికీ ఈ దృశ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సీఎం పర్యటన నేపథ్యంలో జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్ట్‌లో భద్రతా ఏర్పాట్లు, సందర్శకుల సౌకర్యాలు, పనుల పురోగతి వంటి అంశాలపై కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిలుస్తున్న ఈ గోల్డ్ మైన్స్ ప్రాజెక్ట్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని అధికారులు తెలిపారు.
