డీసీసీబీ సేవలను వినియోగించుకోవాలి

డీసీసీబీ సేవలను వినియోగించుకోవాలి

పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్

తొర్రూరు,జూన్25(ఆంధ్రప్రభ): గ్రామీణ ప్రాంత ప్రజలు డిసిసి బ్యాంకింగ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని తొర్రూరు పిఎసిఎస్ చైర్మన్ కాకిరాల హరి ప్రసాద్ రావు కోరారు. డిసిసిబి తొర్రూరు శాఖ ఆధ్వర్యంలో నాబార్డ్ ఆదేశాల మేరకు గురువారం మండలంలోని అమ్మాపురం గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాన్ని డిసిసి బ్యాంక్ మేనేజర్ ఎం.పూర్ణచందర్ అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు ప్రవేశపెట్టిన రాణి రుద్రమ డిపాజిట్ పథకం కింద ఖాతాదారులకు అత్యధికంగా 8.10 శాతం అందిస్తున్నట్లు తెలిపారు. రైతుల అభివృద్ధి కోసం దీర్ఘకాలిక రుణాలు బర్రెలు,గొర్రెలు, ట్రాక్టర్లు, కార్లు, హార్వెస్టర్లు కొనుగోలు చేసేందుకు రుణ సదుపాయాలు, హౌసింగ్, ఎడ్యుకేషన్ లోన్లు అందుబాటులో ఉంటాయన్నారు.

రైతులు, మహిళ సభ్యులకు లోన్లు వర్తిస్తుందన్నారు. ప్రస్తుత సాంకేతిక యుగంలో సులభతరం చేసేందుకు ఆన్ లైన్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, లాకర్ సదుపాయాలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రమాద బీమా లాంటి పథకాలు అందిస్తుందన్నారు. డిసిసి బ్యాంక్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో అమ్మాపురం సర్పంచ్ ముద్దం సునీత వీరారెడ్డి, తొర్రూరు ఇన్చార్జి సీఈవో కె.శ్రీనివాస్,బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ కృష్ణ కాంత్, కళాజాత బృందం నిర్వాహకులు వై.రమేష్,బ్యాంకు సిబ్బంది,రైతులు తదితరులు పాల్గొన్నారు.