పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ: భీంగల్ పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా తదితర అంశాలపై ప్రత్యేక దృష్టితో సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్న భీంగల్ పురపాలక సంఘం కమిషనర్ డి. గజానంద్ జన్మదినోత్సవం సందర్భంగా బుధవారం పురపాలక సంఘం కార్యాలయ సిబ్బంది మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్ చాంబర్‌లో ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా కార్యాలయ ప్రతినిధులు మాట్లాడుతూ… కమిషనర్ నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో జీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. పురపాలక సంఘం కార్యాలయ మేనేజర్ బి. నరేందర్, సీనియర్ అసిస్టెంట్ ప్రతిభా జ్యోతి, వార్డు ఆఫీసర్లు ఎం. రాజేశ్వర్, సంతోష్, బి. రాజేశ్వర్, సున్నపు ఓంకార్, పల్లికొండ శ్రీధర్, కోండ్ర హరీష్, దివ్య, బొమ్మడి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
