పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ

భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా అందజేస్తున్న నోట్‌బుక్స్‌ను బుధవారం పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్ భీంగల్‌లో పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ), పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్వామి పాల్గొని సుమారు 200 మంది విద్యార్థులకు నోట్‌బుక్స్ అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ తదితర విద్యా సామగ్రిని అందజేస్తోందని తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకొని చదువులో రాణించాలని సూచించారు. నోట్‌బుక్స్ అందుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.