ఏజెన్సీ గిరిజనేతర రైతులకు ఇబ్బందులు పెట్టొద్దు
ఏజెన్సీ గిరిజనేతర రైతులకు ఇబ్బందులు పెట్టొద్దు
- ఐఎఫ్ఎస్సి అధికారి నికి వినతి పత్రం ఇచ్చిన ఎమ్మెల్యే
జైనూర్, ఆంధ్రప్రభ : ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల రైతుల హక్కుల పరిరక్షణకు తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి సోమవారం అసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి హైదరాబాదులోని (ఐఎఫ్ఎస్) అధికారిని సి సువర్ణకు తన కార్యాలయంలో కలిసి వినతి పత్రం ఇచ్చినట్లు ఎమ్మెల్యే కోవ లక్ష్మితెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రజాప్రతినిధి బాధ్యత అనే నమ్మకంతో, రైతుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్న గ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని జైనూర్, కెరమెరి, సిర్పూర్ (యు), లింగాపూర్ మండలాల్లో గత 50 సంవత్సరాలకు పైగా సాగు చేస్తున్న ఎస్సీ, బీసీ, మైనార్టీ, గిరిజనేతర రైతులు ఫారెస్ట్ అధికారుల వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను హైదరాబాద్లోని అరణ్య భవన్లో తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ ఉన్నతాధికారి డా. సి. సువర్ణ, (ఐఎఫ్ఎస్) దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి గారు మాట్లాడుతూ, దశాబ్దాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రైతులను ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులకు గురిచేయడం వల్ల వేలాది కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయని వివరించినట్లు తెలిపారు. రైతుల జీవనాధారమైన భూములకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా, సంబంధిత అధికారులకు తగిన సూచనలు జారీ చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.దీనిపై స్పందించిన డా. సి. సువర్ణ, అధికారిని స్పందించి సమస్యను సానుకూలంగా స్వీకరించి, పూర్తి వివరాలు పరిశీలించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కు హామీ ఇచ్చారని ఎమ్మెల్యే కోవలక్ష్మి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట జై నూరు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఇంతియాజ్ లాల, పార్టీ నాయకులు గిరిజనేతర రైతులు పాల్గొన్నట్లు తెలిపారు.
