విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగుల పంపిణీ..
దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని ముత్యంపేట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బుధవారం గ్రామ సర్పంచ్ కుడిమేత తిరుపతి, ఉపసర్పంచ్ ఎండి. ఫయాజ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు పెన్నులు, అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోందని, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన జరుగుతోందని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత చదువులు చదవాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని వారు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ముత్తే బాబు, వట్టి కుట్టి సుధాకర్, తోట రమణయ్య, పాఠశాల ఉపాధ్యాయులు మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
