100Seats | ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఘన విజయం సాధిస్తాం

100Seats | ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఘన విజయం సాధిస్తాం

100Seats | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించినా కాంగ్రెస్ పార్టీ 100 స్థానాలకు పైగా గెలిచి ఘన విజయం సాధిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణా కార్యక్రమంలో ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు పదేళ్ల బీఆర్ఎస్ పాలనను ఇంకా మర్చిపోలేదని, ఆ కాలంలో జరిగిన పరిణామాలను గుర్తుంచుకున్నారని అన్నారు.

అలాగే ఓట్ల దొంగతనంతో పాటు సీట్ల దొంగతనానికి కూడా బీజేపీ పాల్పడుతోందని తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండూ సమాంతరంగా ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను ఉద్దేశపూర్వకంగా తిరస్కరించారని ఆరోపించిన మహేశ్ కుమార్ గౌడ్, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా బూత్ లెవెల్ ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.