దరఖాస్తులకు ఆహ్వానం…

చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలలో తాత్కాలిక ప్రాతిపదికన ఉపాధ్యాయ నియామకాలు చేపడుతున్నారు. ఈ మేరకు అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఇన్‌చార్జి ప్రత్యేక అధికారి దీప ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫిజిక్స్, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు బయోసైన్స్ బోధించేందుకు ఈ నియామకాలు నిర్వహించనున్నారు. పీజీ, బీఎడ్, టెట్ అర్హతలు కలిగిన మహిళా అభ్యర్థులు ఈ నెల 24వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను సంప్రదించాలని కోరారు.