యువ నటుడు రాథోడ్ పురుషోత్తంకు గ్రామంలో ఘన సత్కారం
యువ నటుడు రాథోడ్ పురుషోత్తంకు గ్రామంలో ఘన సత్కారం
కడెం, ఆంధ్రప్రభ: కడెం మండలంలోని పెద్దూర్ గ్రామానికి చెందిన యువ నటుడు రాథోడ్ పురుషోత్తం గ్రామంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సత్కారం పొందారు. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్, నాగార్జున వంటి హీరోల సినిమాల్లో పలు పాత్రల్లో నటించిన ఆయన సినీ రంగంలో గుర్తింపు పొందుతున్నారు.
ఇటీవల రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమాలో రైల్వే శాఖ ఎస్సై పాత్రలో నటించిన పురుషోత్తం, గ్రామంలో నిర్వహించిన పోచమ్మ తల్లి బోనాల వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
భక్తుల సౌకర్యార్థం తన సొంత ఖర్చులతో ఆలయం ముందు రేకుల షెడ్ ఏర్పాటు చేయడంతో గ్రామస్థులు, ఆలయ కమిటీ సభ్యులు ఆయన సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా పురుషోత్తంను శాలువాలతో ఘనంగా సత్కరించారు.
సినీ రంగంలో మరింత రాణించాలని గ్రామస్థులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, యువజన సంఘం సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
