Dumper Driver Escapes RTO Check | పుష్ప రేంజ్లో డ్రైవర్ ఎస్కేప్.. హైవేపై రాళ్లు కుమ్మరించి పరారీ యత్నం
Dumper Driver Escapes RTO Check | పుష్ప రేంజ్లో డ్రైవర్ ఎస్కేప్.. హైవేపై రాళ్లు కుమ్మరించి పరారీ యత్నం
Dumper Driver Escapes RTO Check | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఆర్టీఓ తనిఖీల నుంచి తప్పించుకునేందుకు ఓ డంపర్ డ్రైవర్ చేసిన నిర్వాకం ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపింది. పుష్ప రేంజ్ లో ఎస్కేప్ అయిత తీరు ఏకంగా సినిమానే తలపిస్తోంది. గ్రేటర్ నోయిడా పరిధిలోని ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
సమాచారం ప్రకారం, ఆర్టీఓ అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న డంపర్ డ్రైవర్ తన వాహనాన్ని రాంగ్‌సైడ్‌లో నడుపుతూ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అంతటితో ఆగకుండా వెనుక నుంచి ఎవరూ వెంటాడకుండా ఉండేందుకు డంపర్ జాక్‌ను పైకెత్తి అందులో ఉన్న రాళ్లను రహదారిపై కుమ్మరించాడు. దీంతో హైవేపై ఒక్కసారిగా రాళ్లు చెల్లాచెదురుగా పడటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని రహదారిపై పడిన రాళ్లను తొలగించారు. అనంతరం ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. డ్రైవర్‌ను గుర్తించి చర్యలు తీసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆర్టీఓ తనిఖీల నుంచి తప్పించుకునేందుకు చేసిన ఈ ప్రమాదకర చర్యపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
