రెయిన్‌బో ఆసుపత్రి అగ్నిప్రమాద ప్రాంతం పరిశీలన

రెయిన్‌బో ఆసుపత్రి అగ్నిప్రమాద ప్రాంతం పరిశీలన

విజయవాడ, ఆంధ్రప్రభ: తూర్పు నియోజకవర్గ పరిధిలోని రెయిన్‌బో చిల్డ్రన్స్ ఆసుపత్రిలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాద ప్రాంతాన్ని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మంగళవారం పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను ఆసుపత్రి ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలిసిందన్నారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఫైర్ ప్రొటెక్షన్, సేఫ్టీ పరికరాల కారణంగా అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే ఆసుపత్రి సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారని తెలిపారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. అన్ని సంస్థలు తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించిన ఎమ్మెల్యే, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడం అదృష్టకరమని పేర్కొన్నారు.