ఎరువులు, విత్తనాల కొనుగోలులో రైతులు అప్రమత్తంగా ఉండాలి
ఎరువులు, విత్తనాల కొనుగోలులో రైతులు అప్రమత్తంగా ఉండాలి
మోత్కూర్, ఆంధ్రప్రభ: రైతు సోదరులు ఎరువులు, విత్తనాల కొనుగోలు సమయంలో బస్తాలపై ఉన్న గడువు తేదీని పరిశీలించి కొనుగోలు చేయాలని డిఫెన్స్ వినియోగదారుల హక్కుల సంఘం సభ్యులు సూచించారు.
రైతులు కొనుగోలు చేసిన విత్తనాలు, ఎరువులకు సంబంధించిన బిల్లులను తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. దుకాణాల్లో నకిలీ విత్తనాలు, ఎరువులు వచ్చే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
నకిలీ విత్తనాలు లేదా ఎరువులు కొనుగోలు చేసి మోసపోయిన రైతులు ఎవరైనా ఉంటే డిఫెన్స్ వినియోగదారుల హక్కుల సంఘానికి సమాచారం అందించాలని, వారికి తగిన పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు గుమిడెల్లి పరుశురాములు, ముఖ్య సలహాదారులు అన్నందాస్ మత్స్యగిరి, కొప్పుల సత్యనారాయణ, కోశాధికారి ముక్కెర్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
