స్వీయ గణన సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి
స్వీయ గణన సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి
సర్వేలో మొదటగా వివరాలు నమోదు చేసుకున్నఎమ్మెల్యే
ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని ఘన్పూర్ పంచాయతీలో గల ఎమ్మెల్యే సొంత గ్రామమైన కల్లూరిగూడలో స్వీయ జన గణనను అధికారుల సమక్షంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బొజ్జు పటేల్ ఆదివారం ప్రారంభించారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ సర్వేలో మొదటి పేరును ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ్మ బొజ్జు పటేల్ అధికారుల సమక్షంలో స్వయంగా నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వీయ గణన సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని ఈ సర్వే నమోదులో తమ మొబైల్ లోని డాటా ద్వారా వివరాలు నమోదు చేసుకుని వచ్చారని ఆయన అన్నారు.
ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు జనగణన యాప్ లో ఈ సర్వే వివరాలు నమోదు చేసుకొని ఐడి నెంబర్లను సంబంధిత సర్వేనిమినేటర్లకు ఇస్తే మీ పూర్తి నమోదు చేసిన వివరాలు వారికి తెలుస్తాయని అన్నారు. సర్వే ఎనిమినేటర్లు సూపర్వైజర్లు ప్రజలకు నమోదు వివరాలపై అవగాహన కల్పించి వారి పేర్లు సక్రమంగా నమోదు చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ 15 రోజులు జరిగే సెల్ఫ్ఎన్యూమ నేషన్ సర్వేలో లోటుపాట్లు జరగకుండా అధికారులు చూడాలని ఎమ్మెల్యే కోరారు. జనగణ సర్వను ప్రారంభించి మొదటి పేరు నమోదు చేసుకున్న ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉట్నూర్ మండల తహసిల్దార్ కోట్నాక్ రఘునాథ్ రావు, డిప్యూటీ తాసిల్దార్ అమృతలాల్, ఎనిమినేటర్ రాజ్ కుమార్, గన్ పూర్ సర్పంచ్ ఆనంద్ రావు, కల్లూరు గూడ గ్రామ పటేల్ సోనేరావు, హీరాపూర్ పంచాయతీ ఉప సర్పంచ్ కుమ్మర జంగు, ఆదివాసి నాయకులు మండాడి చంద్రబాన్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
