ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం

న్యాక్ ‘ఏ’ గ్రేడ్ కళాశాలలో కార్పొరేట్ స్థాయి సదుపాయాలు: ప్రిన్సిపాల్ డాక్టర్ శైలజ రాణి

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : ఉరవకొండ పట్టణంలోని న్యాక్ ‘ఏ’ గ్రేడ్ గుర్తింపు పొందిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలు ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శైలజ రాణి తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కళాశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కార్పొరేట్ స్థాయిలో అందుబాటులో ఉన్నాయని, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం ద్వారా నాణ్యమైన విద్య అందిస్తున్నామని పేర్కొన్నారు.

విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, క్రీడా విభాగాలు, జేకేసీ (జవహర్ నాలెడ్జ్ సెంటర్) చురుకుగా పనిచేస్తున్నాయని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సర్టిఫికెట్ కోర్సులు, జాబ్ స్కిల్స్ శిక్షణ, ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

కళాశాలలో బీఏ కోర్సులో ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ గ్రూపులు, బీకాం కోర్సులో కంప్యూటర్ అప్లికేషన్స్, డిజిటల్ మార్కెటింగ్, బీకాం జనరల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అలాగే బీఎస్సీ కోర్సుల్లో కంప్యూటర్ సైన్స్, కెమిస్ట్రీ, జువాలజీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ వంటి విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు తమకు అవసరమైన సర్టిఫికెట్లతో కళాశాలను సందర్శించి సంబంధిత విభాగాల్లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం జేకేసీ కోఆర్డినేటర్లు నాగేంద్ర, సీతారాం గుప్తా, ప్రభాకర్‌లను సంప్రదించాలని ప్రిన్సిపాల్ తెలిపారు.