పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

  • ఎమ్మెల్యే కడియం శ్రీహరి

చిలుపూర్, ఆంధ్రప్రభ:
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం రంగరాయగూడెం, ఇప్పగూడెం గ్రామాల్లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రంగరాయగూడెం గ్రామంలో రూ.33.48 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, మహిళా భవనం, ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవంతో పాటు 8 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.

ఇప్పగూడెం గ్రామంలో రూ.1.10 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించగా, రూ.1.23 కోట్ల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవంతో పాటు 40 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే శ్రీహరి మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేనటువంటి ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేద ప్రజల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుంటోందని తెలిపారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను చూడడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌లు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి, మందపురం రాణి అనిల్, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, పంచాయతీరాజ్, హౌసింగ్ శాఖ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.