గ్రామాలలో ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరించాలి..

టేకుమట్ల, ఆంధ్రప్రభ : ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జులై 7న మండలంలోని అన్ని గ్రామాల్లో ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టేకుమట్ల ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు రేణుకుంట్ల శంకర్ మాదిగ తెలిపారు. అనంతరం సబ్బండ వర్గాల ఆశాజ్యోతి, జాతి మహాత్ముడు మంద కృష్ణ మాదిగ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మండలంలోని నాయకులు, కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.