గ్రామీణ ఆరోగ్య సేవల్లో ఆర్‌ఎంపీల పాత్ర కీలకం

గ్రామీణ ఆరోగ్య సేవల్లో ఆర్‌ఎంపీల పాత్ర కీలకం

ఆర్‌ఎంపీ డాక్టర్లతో ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆత్మీయ సమావేశం

అచ్చంపేట, ఆంధ్రప్రభ: ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఆర్‌ఎంపీ . డాక్టర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పేర్కొన్నారు. అచ్చంపేట పట్టణంలో తాలూకా ఆర్‌ఎంపీ డాక్టర్లతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవల విస్తరణ, ప్రజారోగ్య పరిరక్షణ, వైద్య రంగంలో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై విస్తృతంగా చర్చించారు.

గ్రామీణ ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో ఆర్‌ఎంపీ డాక్టర్ల సేవలు ఎంతో విలువైనవని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. ప్రజల ఆరోగ్య సంరక్షణలో ప్రతి వైద్యుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. “ప్రజల ఆరోగ్యమే మన అందరి ప్రాధాన్యత” అని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ స్పష్టం చేశారు. సమావేశంలో పలువురు ఆర్‌ఎంపీ డాక్టర్లు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.