Tirumala Helicopter Controversy | భక్తుల్లో ఆగ్రహం
Tirumala Helicopter Controversy | భక్తుల్లో ఆగ్రహం
Tirumala Helicopter Controversy | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్: తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి హెలికాప్టర్ ప్రయాణించిన ఘటన భక్తుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఆలయ పవిత్రతకు విఘాతం కలిగే విధంగా ఈ ఘటన జరిగిందని పలువురు భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం ఆలయ గర్భగుడి పైనుగా డ్రోన్లు, విమానాలు లేదా ఇతర వైమానిక వాహనాల సంచారం ఉండకూడదని భక్తులు పేర్కొంటున్నారు. అయితే ఇటీవల ఆలయంపై నుంచి హెలికాప్టర్ వెళ్లిన దృశ్యాలు వెలుగులోకి రావడంతో ఈ అంశం వివాదాస్పదంగా మారింది.
ఇప్పటికే తిరుమల పరిసర ప్రాంతాల్లో విమానాల సంచారంపై అప్పుడప్పుడు అభ్యంతరాలు వ్యక్తమవుతుండగా, ఈసారి హెలికాప్టర్ ఆలయంపై నుంచి వెళ్లిందనే ఆరోపణలు మరింత చర్చకు దారితీశాయి. ఈ విషయంలో టీటీడీ, సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు. శ్రీవారి ఆలయ పవిత్రతను పరిరక్షించేందుకు మరింత కఠిన నియంత్రణలు అమలు చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
