సూర్యాపేటలో ఆగిన పవన్ కళ్యాణ్

సూర్యాపేటలో ఆగిన పవన్ కళ్యాణ్

సూర్యాపేట, ఆంధ్రప్రభ: హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ సూర్యాపేటలో కొద్దిసేపు ఆగారు. హైదరాబాద్‌లో పర్యటన ముగించుకుని రోడ్డు మార్గంలో విజయవాడ వైపు వెళ్తున్న విషయం తెలుసుకున్న అభిమానులు అంజనపురి చౌరస్తాలో భారీగా గుమికూడారు. దీంతో ఆయన కాన్వాయ్‌ను ఆపి అభిమానులకు అభివాదం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.