Rahul | యువతతో సంభాషించనున్న రాహుల్ ..

Rahul | యువతతో సంభాషించనున్న రాహుల్ ..

  • ఛత్రోన్ కి గూంజ్” (విద్యార్థుల గొంతుక) పేరుతో కాంగ్రెస్ శ్రీకారం
  • రాజస్థాన్‌లోని కోటా వేదిక
  • అగ్రనేత రాహుల్ హాజరు
  • నీట్ వివాదం, పరీక్షల పేపర్ లీకేజీలు, నిరుద్యోగం, రిక్రూట్‌మెంట్‌లో జరుగుతున్న అవకతవకలపై విద్యార్థులు, యువతతో సంభాషించనున్న రాహుల్

Rahul | ఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశవ్యాప్త యువజన, విద్యార్థి ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఛత్రోన్ కి గూంజ్” (విద్యార్థుల గొంతుక) పేరుతో రాజస్థాన్‌లోని కోటా వేదికగా గళం విప్పనున్నది. బుధవారం సాయంత్రం ఏడున్నర గంటలకు శ్రీరామ్ రంగమంచ్, దసరా మైదానంలో చేపడుతున్న ఈ కార్యక్రమానికి లోకసభ ప్రతిపక్ష నేత, అగ్రనేత రాహుల్ గాంధీ విచ్చేస్తున్నారు. నీట్ వివాదం, పరీక్షల పేపర్ లీకేజీలు, నిరుద్యోగం, రిక్రూట్‌మెంట్‌లో జరుగుతున్న అవకతవకలపై రాహుల్ గాంధీ నేరుగా విద్యార్థులు, యువతతో ముచ్చటించనున్నారు. దేశంలోనే అతిపెద్ద కోచింగ్ హబ్‌గా పేరొందిన కోటా నుంచి.. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన సమస్యలను దేశవ్యాప్తం చేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.