గిడ్డంగుల గోదాం స్థల పరిశీలన
గిడ్డంగుల గోదాం స్థల పరిశీలన
కుంటాల, (ఆంధ్రప్రభ): రైతుల పంట ఉత్పత్తుల నిల్వ సౌకర్యం కోసం గిడ్డంగుల గోదాం నిర్మాణానికి కుంటాల మండలంలోని విట్టాపూర్ గ్రామంలో తహసీల్దార్ ఆడే కమల్ సింగ్ మంగళవారం స్థల పరిశీలన చేపట్టారు.
ఈ సందర్భంగా గిడ్డంగుల నిర్మాణానికి అనువుగా ఉన్న ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించారు. స్థానిక సర్పంచ్, గ్రామస్తులు మాట్లాడుతూ రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గిడ్డంగుల గోదాం ఏర్పాటు కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని తహసీల్దార్ పేర్కొన్నారు.
రైతులు తమ ధాన్యం నిల్వ చేసేందుకు సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, గిడ్డంగుల గోదాం ఏర్పాటు చేస్తే ఎంతో మేలు జరుగుతుందని తహసీల్దార్‌కు వివరించారు. సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రాకేష్ రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు సిందే పటేల్, ఆర్ఐ రాజేశ్వర్, మాజీ సర్పంచులు లక్ష్మి రమేష్, విఠల్‌రావు పటేల్, ఉపసర్పంచ్ సీహెచ్ అశోక్, లింగారెడ్డి, సీహెచ్ రవి, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.
