స్కూల్, కాలేజీ బస్సుల తనిఖీలు
స్కూల్, కాలేజీ బస్సుల తనిఖీలు
పెద్దపల్లి రూరల్, (ఆంధ్రప్రభ): రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆదేశాల మేరకు పెద్దపల్లిలో ట్రాఫిక్ పోలీసులు బుధవారం స్కూల్, కాలేజీ బస్సులను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా బస్సుల కండిషన్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్‌సీ), ఫిట్‌నెస్, డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు ఇతర సంబంధిత పత్రాలను పరిశీలించారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బస్సుల్లో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించవద్దని డ్రైవర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఈ తనిఖీలను ట్రాఫిక్ సీఐ బి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించగా, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
