crime | తాగి లొల్లి చేస్తుండని… అల్లుడిని చంపిన మామ

crime | తాగి లొల్లి చేస్తుండని… అల్లుడిని చంపిన మామ

ఇనుప రాడ్‌తో తలపై దాడి.. అక్కడికక్కడే మృతి

crime | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో కుటుంబ కలహాలు విషాదానికి దారితీశాయి. మద్యం మత్తులో తరచూ గొడవలకు దిగుతున్న అల్లుడిని మామ ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసుల కథనం ప్రకారం.. కంకల కుమారస్వామి, కలమ్మ దంపతుల అల్లుడు కొండే నరేశ్‌ (36) మద్యానికి బానిసయ్యాడు. తరచూ అత్తగారింటికి వచ్చి కుటుంబ సభ్యులతో గొడవపడేవాడని సమాచారం.

సోమవారం అర్ధరాత్రి కూడా మద్యం మత్తులో అత్తగారింటికి వచ్చిన నరేశ్‌ మరోసారి గొడవకు దిగాడు. దీంతో ఆగ్రహానికి గురైన మామ కుమారస్వామి ఇనుప రాడ్‌తో అతని తలపై బలంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలతో నరేశ్‌ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అనంతరం నిందితులను మంగళవారం రిమాండ్‌కు తరలించారు.