TG | హైద‌రాబాద్‌లో 208 మంది పాకిస్థానీయులు

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల సీఎంల‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్ర‌త్యేకంగా ఫోన్ చేసి మాట్లాడారు. భారత్‌లో ఉన్న పాకిస్థాన్ పౌరులు వెంటనే వెళ్లిపోవాలని, పాక్‌ పౌరులను అనుమతించేది లేద‌ని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ స్పష్టం చేశారు.

పాక్ దేశ‌స్తుల‌ను గుర్తించండి..
రాష్ట్రంలో పాక్ దేశస్తులను వెంటనే గుర్తించి వెనక్కి పంపాలని కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరంలో ఉన్న పాకిస్థానీయులపై పోలీసులు ఇప్పటికే ఫోకస్ పెట్టారు. అందుకు సంబంధించి వివరాలను కూడా సేకరించారు. తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్‌ నగరంలో 208మంది పాకిస్థానీయులు ఉన్నట్లుగా తేల్చారు. మరో 48 గంటల్లో పాక్ పౌరులు దేశం విడిచి వెళ్లిపోవాలని సూచించారు.

Leave a Reply