అర్హులందరికి ఓటు హక్కు కల్పించాలి.

అర్హులందరికి ఓటు హక్కు కల్పించాలి.

మాజీ డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ రెడ్డి

పాయకాపురం, ఆంధ్రప్రభ : అర్హులందరికి ఓటు హక్కు కల్పించాలని మాజీ డిప్యూటీ మేయర్ అవుతు శైలజ రెడ్డి అన్నారు. భారత దేశ ప్రభుత్వం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజిన్ (సర్)అనే కార్యక్రమం అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో నిర్వహించారు. పలు సచివాలయం పరిధిలో జరుగుతున్న సర్ కార్యక్రమాన్ని మాజీ డిప్యూటీ మేయర్ అవుతు శైలజ రెడ్డి పర్యవేక్షణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆమె బి.ఎల్. ఓ,బి.ఎల్.ఏలతో కలసి ఓటర్ వెరిఫికేషన్ చేశారు. ఎక్కువ సార్లు ఓటు హక్కు కలిగి ఉండి, ఓటర్ ఒక చోట నుండి మరొక చోటకి వెళ్లిన, సంబంధింత ఓటర్ చనిపోతే ఓటు హక్కును పూర్తిగా తొలగించాలని ఆమె బి.ఎల్.ఓలను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *