విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

489 సర్వీసులకు విజిలెన్స్ దాడుల్లో పది లక్షల జరిమానా
43 బృందాలుగా విస్తృత తనిఖీలు

చిట్టినగర్, ఆంధ్రప్రభ : విజయవాడ చిట్టినగర్ పరిసర ప్రాంతాల్లో సోమవారం ఉదయం విద్యుత్ శాఖ విజిలెన్స్ ఈ ఈ పి.విజయ కుమారి విజయవాడ పట్టణం ఈ ఈ కె.వై కొండలరావు ఆధ్వర్యంలో అధికారులు 43 బృందాలుగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ విస్తృత తనిఖీలు భాగంగా 2641 గృహ సర్వీసులు, 135 వాణిజ్య సముదాయాల సర్వీసులను తనిఖీ చేశారు. వాటిలో 489 సర్వీసులు సంబంధించి ప్రజలు అదనపు లోడును వాడటం గమనించారు. వారికి ప్రతి 500 కె.వి కి 2 వేలు చొప్పున మొత్తానికి పది లక్షలు రూపాయలు విధించారు. అలాగే అనధికారికంగా వాడుతున్న 1 సర్వీసుకు గాను 5,000/- రూ జరిమాన విధించారు‌.

విద్యుత్ చౌర్యం చేస్తున్న 2 సర్వీసులకు గాను 29000/- రూపాయలు చొప్పున జరిమానా విధించారు. ఈసందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.వి కొండలరావు మాట్లాడుతు విద్యుత్ చౌర్యం సామాజిక నేరమని, విద్యుత్ చౌర్యం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపినారు. ఎక్కడైనా విద్యుత్ చౌర్యం జరుగుతున్నట్లు ప్రజలు గమనిస్తే 8331014951, 8331020537 నెంబర్లకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ విద్యుత్ విజిలెన్స్ తనిఖీల లో విజయవాడ పట్టణం డివిజన్ 4 డి ఈ ఈ. ఎం గోవింద రాజు , చిట్టినగర్ ఏఈఈ. ఎస్. కె.జానీ బాషా విజయవాడ డివిజన్ పరిధిలోని ఏఈలు, జేఈలు, లైన్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *