ప్రజాసేవకు అత్యుత్తమ వేదిక టీడీపీ
ప్రజాసేవకు అత్యుత్తమ వేదిక టీడీపీ
సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
పాయకాపురం, ఆంధ్రప్రభ : ప్రజాసేవకు అత్యుత్తమ వేదిక తెలుగుదేశం పార్టీ అని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. అజిత్ సింగ్‌నగర్‌లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు సమక్షంలో 62, 63, 64 డివిజన్లకు చెందిన సుమారు 100 మంది యువకులు, కార్యకర్తలు ఎస్సీ నాయకుడు విజయ్ కుమార్, మైనార్టీ యువ నాయకుడు భాషా ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.పార్టీలో చేరిన వారందరికీ బొండా ఉమా పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన లక్ష్యంగా పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ విధానాలు యువతను, వివిధ వర్గాల ప్రజలను ఆకర్షిస్తున్నాయని, ప్రజాసేవ చేయాలనే సంకల్పం ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుగుదేశం పార్టీ అత్యుత్తమ వేదికగా నిలుస్తోందని పేర్కొన్నారు. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం పెరగడం ప్రజాస్వామ్యానికి శుభపరిణామమని, యువత రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు బొండా సిద్ధార్థ,బుదాల సురేష్ బాబు, నందేటి ప్రేమ్, అబ్రహం,ఆకుల సూర్య ప్రకాష్,కంచేటి నాగరాజు,లక్కీశెట్టి సాయి తదితర నాయకులు పాల్గొన్నారు.
