“సర్” కార్యక్రమానికి సహకరించండి..

సర్” కార్యక్రమానికి సహకరించండి..

సెంట్రల్లో లాంఛనంగా ప్రారంభించిన.
ఎమ్మెల్యే బొండా ఉమా..

పాయకాపురం, ఆంధ్రప్రభ : సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని రాజీవ్ నగర్ ప్రాంతంలో “సర్” కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. బి. ఎల్. ఓ, బి. ఎల్.ఏలతో కలసి ఆయన ఓటర్ వేరఫికేషన్ చేశారు.ఓటర్ వేరఫికేషన్ పారదర్శకంగా ఉండాలన్నారు.ప్రజల సర్ కార్యక్రమానికి వచ్చే అధికారులకు సహకరించి వివరాలు తెలియజేయాలని అన్నారు.

ఈకార్యక్రమంలో కస్టర్ ఇంచార్జి బత్తుల కొండా,సెంట్రల్ టీడీపీ మహిళా అధ్యక్షురాలు పైడి తులసి శ్రీను,అధ్యక్షుడు లబ్బ వైకుంటం దుర్గా,ఇంచార్జి మోతుకూరి ఖాసిమ్, ప్రధాన కార్యదర్శి కోలా శ్రీను,పెద్ది శ్రీను,తాడిశెట్టి నాగలక్ష్మి,చిగుళ్ల దుర్గాప్రసాద్ నాగమణి, యూనిట్ ఇంచార్జి వలి,దుర్గాసి రాము,విజయ్,సి. హెచ్ రవి,ఆంబోజి శ్రీను తదితరులు పాల్గొన్నారు.