Khammam ప్రజల్లోనే ప్రయాణం.. సేవలోనే సంతృప్తి: తుమ్మల యుగేందర్ ప్రత్యేకత
Khammam ప్రజల్లోనే ప్రయాణం.. సేవలోనే సంతృప్తి: తుమ్మల యుగేందర్ ప్రత్యేకత
- తెల్లవారుజాము నుంచే ప్రజల మధ్య విస్తృత పర్యటనలు
- డివిజన్ల వారీగా సమస్యలపై ప్రత్యక్ష అవగాహన
- ప్రజలతో మమేకమవుతున్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు
- అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తున్న యుగేందర్
- ఓదార్పు, ఆదరణతో ప్రజల మనసులు గెలుచుకుంటున్న నేత
- కార్యకర్తలు, స్థానికులతో నిరంతర సమన్వయం
ఖమ్మం(Khammam), ఆంధ్రప్రభ: కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు తుమ్మల యుగేందర్ ప్రజల మధ్యే ఎక్కువ సమయం గడుపుతూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. తెల్లవారుజాము నుంచే వివిధ డివిజన్లలో పర్యటిస్తూ స్థానిక సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు.
ప్రతి ప్రాంతంలో ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. సమయపాలనతో కార్యక్రమాలను నిర్వహించడం ఆయన పనితీరుకు ప్రత్యేకతగా నిలుస్తోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ స్థానిక నాయకులతో సమన్వయం కొనసాగిస్తున్నారు.
ప్రజా సమావేశాల్లో తుమ్మల యుగేందర్ అభివృద్ధి, విద్య, యువత భవిష్యత్తు వంటి అంశాలపై దృష్టి సారిస్తూ ప్రసంగిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ చేరాలని పిలుపునిస్తూ, యువత సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని సూచిస్తున్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో కృషి చేయాలని ప్రోత్సహిస్తున్నారు.
సమస్యలు ఎదుర్కొంటున్న కుటుంబాలను పరామర్శించడం ఆయన పర్యటనల్లో ముఖ్యాంశంగా మారింది. బాధితులను ఓదార్చుతూ, అవసరమైన చోట అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. వృద్ధులు, మహిళలు, యువతతో ప్రత్యేకంగా మమేకమవుతూ ప్రజలకు చేరువవుతున్నారు.
పలు ప్రాంతాల్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ మౌలిక వసతుల విస్తరణపై దృష్టి సారిస్తున్నారు. స్థానిక అవసరాలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
నిరంతర పర్యటనలు, ప్రజలతో ప్రత్యక్ష అనుబంధం ద్వారా తుమ్మల యుగేందర్ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటున్నారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. సేవ, సమన్వయం, అందుబాటు అనే లక్షణాలతో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు.

