TG | అభివృద్ధిలో ఆదర్శం సర్పంచ్ గడిపర్తి

TG | అభివృద్ధిలో ఆదర్శం సర్పంచ్ గడిపర్తి
వాటర్ ట్యాంక్ క్లీనింగ్
చేతిపంపు మరమ్మత్తులు
డ్రైనేజ్ పూడికతీత
TG | వేంసూరు, ఆంధ్రప్రభ : జయలక్ష్మిపురం గ్రామాభివృద్ధిలో తన ప్రత్యేకతను సర్పంచ్ గడిపర్తి శ్రీనివాసరావు చూపిస్తున్నారు. త్రాగునీటి ఇబ్బందులను తొలగించేందుకు చేతి పంపులు మరమ్మత్తులు చేపట్టారు. త్రాగునీటి సరఫరాలో కాలుష్య రహిత నీటిని అందించేందుకు వాటర్ ట్యాంక్ క్లీనింగ్, పరిసరాలు పరిశుభ్రత, లీకేజీ సమస్యలు పరిష్కారం చేసే చర్యలకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో వర్షపునీరు, నివాస ప్రాంతాలలో వాడిన నీరు, నిల్వ లేకుండా పారుదలకు డ్రైనేజీలు పూడికతీత పనులు కొనసాగుచున్నాయి. ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ, గ్రామ సమస్యల పరిష్కారంలో తనదైన ముద్ర వేస్తూ, దూసుకుపోతున్న గడిపర్తి శ్రీనివాసరావు సేవలు.

