కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల సంతకాలు సేకరణ
జూలూరుపాడు, ఆంధ్రప్రభ ; అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కేందుకు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ డిమాండ్ చేశారు.ఆదివారం కిసాన్ మోర్చా ఆద్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలను నెరవేర్చాలని చిలుకూరి రమేష్ ఆధ్వర్యంలో రైతుల నుంచి సంతకాల సేకరణల కార్యక్రమాన్ని మండలంలో చేపట్టారు.
ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రైతుల సమస్యలను బిజెపి పార్టీ శాసనసభ పక్షం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు.రైతుల నుంచి సేకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందచేస్తామని చెప్పారు.రాష్ట్రంలో రబీ సీజన్ వరి పంట కోతలు ప్రారంభం కాబోతున్నాయి, నేటి వరకు రైతు భరోసా డబ్బులు రైతుల బ్యాంక్ అకౌంట్లో వెయ్యలేదని ఆరోపించారు.వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ 12 వేల రూపాయల ఆర్థిక చేయూత ఇవ్వలేదని రమేష్ విమర్శించారు.
బ్యాంకుల ద్వారా వ్యవసాయ రుణాలు తీసుకున్న రూ.2 లక్షల మాఫీ సంపూర్ణంగా జరగలేదని, మాఫీ కానీ రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. రేవంత్ సర్కార్ అధికారం చేపట్టి రెండేళ్లు దాటిన పంటల బీమా పథకం గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అధికార పక్షానికి మద్దతు ఇస్తుందన్నారు.
రైతులకు,పేద ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న సిపిఐ పార్టీ ఎందుకు కాంగ్రెస్ పార్టీతో దోస్తీ కడుతుందని రమేష్ ఎద్దేవా చేశారు. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా వంట గ్యాస్ కొరత ఏర్పడకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నదని,తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన గ్యాప్ స్టాకు ఉంచిందన్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని, బ్లాక్ మార్కెట్లోకి గ్యాస్ తరలిపోకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రమేష్ కోరారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మాదినేని సతీష్, జిల్లా నాయకులు నున్న రమేష్, బిజెపి మండల అధ్యక్షుడు భూక్య రమేష్,తెల్లం నరసింహారావు,కిసాన్ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి సిరిపురపు పుల్లారావు, నిమ్మటూరి రామారావు, సిరిపురపు గోపాలరావు, నర్వనేని కృష్ణ,వందనపు సుబ్బు, రైతులు పాల్గొన్నారు.
