Sirpur అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

Sirpur అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

రైతు వేదిక బాత్రూంలో మృతదేహం లభ్యం..

సిర్పూర్ (యు) Sirpur అనుమానాస్పదంగా వ్యక్తి మృతి, ఆంధ్రప్రభ: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలోని పంగిడి పంచాయతీ పరిధిలో అనుమానాస్పద పరిస్థితుల్లో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. మడావి మోతిరామ్ (36) అనే వ్యక్తి రైతు వేదిక బాత్రూంలో మృతి చెందినట్లు గుర్తించారు. మృతుని భార్య తెలిపిన వివరాల ప్రకారం, ఆయన జైనూర్ మండలం జామిని గ్రామానికి చెందినవారని, పంగిడి గ్రామంలోని అత్తగారి ఇంటికి వచ్చినట్లు తెలిసింది.

సిర్పూర్ (యు) ఎస్సై విక్రం తెలిపిన వివరాల ప్రకారం, మోతిరామ్ మద్యానికి బానిసై తరచూ మద్యం సేవించే అలవాటు ఉన్న వ్యక్తిగా గుర్తించారు. శనివారం ఇంటి నుండి వెళ్లిన ఆయన తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించగా, ఆదివారం రైతు వేదిక బాత్రూంలో పడి మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. భార్య, బంధువుల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

విషయం తెలిసిన వెంటనే పంగిడి సర్పంచ్ ఆత్రం మీరా జాలింషా ఘటనాస్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Leave a Reply