పార్టీ పదవి ఒక బాధ్యత…
పార్టీ పదవి ఒక బాధ్యత…
సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా.
పాయకాపురం, ఆంధ్రప్రభ : పార్టీ పదవి అనేది ఒక బాధ్యతని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.సింగ్ నగర్ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సెంట్రల్ టీడీపీ మహిళా ఉపాధ్యక్షురాలు పైడి తులసిని మహిళా అధ్యక్షురాలుగా నియమించారు. ఈ సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావుకి పైడి తులసి, మహిళా కమిటీ సభ్యులు పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు.
పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, మహిళా సాధికారతకి సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా పార్లమెంట్ కార్యదర్శి ఎస్. కె గౌసియా,మహిళా ఉపాధ్యక్షురాలు తాడిశెట్టి శ్రీనాగలక్ష్మి,బత్తుల కోటేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
