ఆపదలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి అండగా ఉంటా..

ఆపదలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి అండగా ఉంటా..

  • మంత్రి కేవిఆర్

చిట్యాల, ఆంధ్రప్రభ : తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన చిట్యాల పట్టణానికి చెందిన నిరుపేద కుటుంబం కడారి లింగయ్య యాదవ్ కూతురు అల్లుడు మృతి చెందారు, మనవడు జాల శివ చరణ్, మనవరాలు సాయిరాణి ఈ విషయాన్ని చిట్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డికి తెలపగా వెంటనే ఆయన స్పందించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి శనివారం రోజున తీసుకుపోయారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తక్షణమే స్పందించి పై చదువుల నిమిత్తం అమ్మాయికి ప్రవేటు కాలేజీ సీట్ ఇప్పించడం తో పాటు వారి కుటుంబ సభ్యులకు 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి మరోసారి నిరుపేదల పట్ల మరోసారి మంత్రి మానవత్వం చాటుకున్నారు.