vizag steel plant | 10కి చేరిన మృతుల సంఖ్య
vizag steel plant | 10కి చేరిన మృతుల సంఖ్య
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాదం..
vizag steel plant | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో ఇటీవల జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య 10కు చేరింది. ప్రమాదం జరిగిన నాటి నుంచి సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుడు సూరిబాబు శనివారం మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
ఈ నెల 8న స్టీల్‌ప్లాంట్‌లో ఉక్కు ద్రవం లీకై సంభవించిన ప్రమాదంలో పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడగా, పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. గాయపడిన వారిలో సూరిబాబు పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో మృతుల సంఖ్య 10కు చేరింది.
ఇదిలా ఉండగా, స్టీల్‌ప్లాంట్‌లో వరుసగా చోటుచేసుకుంటున్న ప్రమాదాలను యాజమాన్యం తీవ్రంగా పరిగణించింది. ప్రాథమిక విచారణలో భద్రతా ప్రమాణాల అమలులో నిర్లక్ష్యం జరిగినట్లు గుర్తించిన యాజమాన్యం, 15 మంది ఉద్యోగులు, అధికారులను తక్షణమే సస్పెండ్ చేసింది.
అంతర్గత విచారణలో భాగంగా మరో 19 మందిని ఇతర విభాగాలకు బదిలీ చేసినట్లు సమాచారం. ప్రమాదానికి దారితీసిన కారణాలు, బాధ్యుల పాత్రపై విచారణ కొనసాగుతోంది.
ఈ ఘటనపై ఇప్పటికే జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) కూడా స్పందించి నివేదిక కోరిన విషయం తెలిసిందే.
