ప్రజాదర్బార్‌లో సమస్యల వెల్లువ..

ప్రజాదర్బార్‌లో సమస్యల వెల్లువ..

త్వరిత పరిష్కారానికి నాయకుల హామీ

అవనిగడ్డ, ఆంధ్రప్రభ : స్థానిక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను పార్టీ నాయకుల దృష్టికి తీసుకువచ్చారు.

ముఖ్యంగా పింఛన్లు, రేషన్ కార్డులు, భూ సమస్యలు, డ్రెయినేజీ, రహదారుల మరమ్మతులకు సంబంధించిన అర్జీలను నాయకులు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఏఎంసి చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రజాదర్బార్ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

టీడీపీ నాయకులు మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రావి రత్నగిరి, పార్టీ నాయకులు మండలి రామమోహనరావు, పర్చూరి దుర్గాప్రసాద్, మాదివాడ రత్నారావు, గాజుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.