Kane Williamson | అంతర్జాతీయ క్రికెట్‌కు కేన్ మామ వీడ్కోలు..
Kane Williamson | అంతర్జాతీయ క్రికెట్‌కు కేన్ మామ వీడ్కోలు..
- అభిమానులకు హార్ట్ బ్రేక్..
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది. ఫీల్డ్ పై అతని క్లామ్ నేచర్, అద్భుతమైన టెక్నిక్, నిలకడైన ప్రదర్శనలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న విలియమ్సన్ రిటైర్మెంట్ తో ఓ గొప్ప అధ్యాయానికి తెరపడింది. 2010లో న్యూజిలాండ్ (New Zealand BLACKCAPS) తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన విలియమ్సన్.. మూడు ఫార్మాట్లలోనూ జట్టుకు అద్భుత సేవలందించాడు. 16 ఏళ్ల కెరీర్లో 19,346 అంతర్జాతీయ పరుగులు, 48 సెంచరీలు, 6 డబుల్ సెంచరీలు నమోదు చేసి న్యూజిలాండ్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.
న్యూజిలాండ్ చరిత్రలోనే అత్యధిక పరుగులు…
35 ఏళ్ల విలియమ్సన్ తన 16 ఏళ్ల కెరీర్లో 19,346 అంతర్జాతీయ పరుగులు, 48 సెంచరీలు, 6 డబుల్ సెంచరీలు నమోదు చేసి న్యూజిలాండ్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
కెప్టెన్‌గా స్వర్ణయుగం
2016 నుంచి 2024 వరకు న్యూజిలాండ్ జట్టును మూడు ఫార్మాట్లలో నడిపించిన విలియమ్సన్.. జట్టును స్వర్ణయుగంలోకి తీసుకెళ్లాడు. అతడి నాయకత్వంలో న్యూజిలాండ్ రెండు వన్డే ప్రపంచకప్ ఫైనల్స్, మూడు ఐసీసీ టోర్నీ సెమీఫైనల్స్ చేరుకుంది. అంతేకాదు 2021లో జరిగిన తొలి ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను గెలిచి చరిత్ర సృష్టించింది.
‘కేన్ మామా’కు భావోద్వేగ వీడ్కోలు
శాంత స్వభావం, అద్భుత బ్యాటింగ్ టెక్నిక్, నాయకత్వ లక్షణాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న విలియమ్సన్ రిటైర్మెంట్తో క్రికెట్ అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. “థ్యాంక్యూ ఫర్ ఎవ్రీథింగ్ కేన్ మామా” అంటూ సోషల్ మీడియాలో అభిమానులు పోస్టులు పెడుతూ తమ అభిమాన క్రికెటర్‌కు వీడ్కోలు చెబుతున్నారు. క్రీజ్‌లో నిలబడి గంటల తరబడి ప్రత్యర్థి బౌలర్లను విసిగించిన ఆ క్లాసిక్ బ్యాటర్ ఇక అంతర్జాతీయ క్రికెట్లో కనిపించకపోవడం అభిమానులకు మాత్రం లోటుగానే మిగిలిపోనుంది.ఇప్పుడు
అందని ద్రాక్షగా 10 వేల పరుగుల మైలురాయి.. !
ప్రపంచ క్రికెట్‌ను దశాబ్దానికి పైగా తమ బ్యాటింగ్‌తో శాసించిన ఇద్దరు మహా బ్యాటర్లు విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్. కోట్లాది మంది అభిమానులకు స్ఫూర్తిగా నిలిచిన ఈ దిగ్గజాలు టెస్ట్ క్రికెట్లో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టినా.. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే 10 వేల పరుగుల క్లబ్లో మాత్రం చేరలేకపోయారు.
తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ తన టెస్ట్ కెరీర్‌ను 9,515 పరుగులతో ముగించాడు. మరో 485 పరుగులు చేస్తే 10 వేల పరుగుల మైలురాయిని అందుకునేవాడు. కానీ ఆ కల నెరవేరకుండానే తన కెరీర్‌కు ముగింపు పలికాడు.

మరోవైపు భారత దిగ్గజం విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పే సమయానికి 9,230 పరుగుల వద్ద నిలిచిపోయాడు. 10 వేల పరుగుల క్లబ్లో చోటు సంపాదించాలంటే మరో 770 పరుగులు అవసరమయ్యాయి. అయితే కెరీర్ ముగియడంతో ఆ అవకాశం కూడా చేజారిపోయింది.
టెస్ట్ క్రికెట్లో 10 వేల పరుగులు సాధించడం అత్యంత అరుదైన ఘనత. ప్రపంచ క్రికెట్ చరిత్రలో కొద్దిమంది మాత్రమే ఆ మైలురాయిని అందుకున్నారు. అలాంటి ఘనతకు ఎంతో దగ్గరగా వచ్చి కూడా కోహ్లీ, విలియమ్సన్ వంటి ఆధునిక క్రికెట్ దిగ్గజాలు దానిని అందుకోలేకపోవడం అభిమానులను తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తోంది.
ఫ్యాబ్-4 పరిస్థితి ఏంటి?
ఆధునిక క్రికెట్లో బ్యాటింగ్‌కు కొత్త నిర్వచనం ఇచ్చిన “ఫ్యాబ్-4” (Fab Four) శకం ముగింపు దశకు చేరుకుంది. భారత దిగ్గజం విరాట్ కోహ్లీ, ఇంగ్లండ్ స్టార్ జో రూట్, ఆస్ట్రేలియా రన్ మెషీన్ స్టీవ్ స్మిత్, న్యూజిలాండ్ మాస్టర్ బ్యాటర్ కేన్ విలియమ్సన్.. ఈ నలుగురు దాదాపు దశాబ్ద కాలానికి పైగా ప్రపంచ క్రికెట్‌ను తమ బ్యాటింగ్‌తో శాసించారు. టెస్టులు, వన్డేలు, టీ20ల్లో పరుగుల వరద పారిస్తూ ఆధునిక క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్లుగా గుర్తింపు పొందారు. అయితే కాలం మారుతోంది. ఒకప్పుడు మూడు ఫార్మాట్లలోనూ ఆధిపత్యం చెలాయించిన ఈ నలుగురు ఇప్పుడు ఒక్కో ఫార్మాట్‌కు దూరమవుతున్నారు. తాజాగా కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో ఫ్యాబ్-4 శకం ముగిసినట్లే కనిపిస్తోంది.
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్ని అంతర్జాతీయ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో ఫ్యాబ్-4లో పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తొలి ఆటగాడిగా నిలిచాడు. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇప్పటికే టీ20 అంతర్జాతీయ క్రికెట్, టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా దిగ్గజం స్టీవ్ స్మిత్ వన్డేలకు వీడ్కోలు పలికాడు. అయితే టెస్ట్ క్రికెట్లో ఇంకా ఆస్ట్రేలియాకు కీలక బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ స్టార్ జో రూట్ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్లో ఇంగ్లండ్ బ్యాటింగ్‌కు ప్రధాన బలంగా ఉన్నాడు.
