Tragedy | ముగ్గురు విద్యార్థులు మృతి

Tragedy | ముగ్గురు విద్యార్థులు మృతి

Tragedy | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మన్నార్గుడి సమీపంలో ప్రభుత్వ పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఇంటికి వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టి బోల్తాపడింది.

ప్రాథమిక సమాచారం ప్రకారం… మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా కారు నడుపుతూ విద్యార్థులను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విద్యార్థులను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.

అయితే అప్పటికే ముగ్గురు విద్యార్థులు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతులు ఆరవ, ఏడవ తరగతుల్లో చదువుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులుగా గుర్తించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.