Devadula Irrigation Project Land Acquisition Delay| 25 ఏళ్లుగా కొనసాగుతున్న భూసేకరణ సమస్య

Devadula Irrigation Project Land Acquisition Delay| 25 ఏళ్లుగా కొనసాగుతున్న భూసేకరణ సమస్య

Devadula Irrigation Project Land Acquisition Delay| దేవాదుల ప్రాజెక్టు ప్రారంభం – భారీ ఆశలు
సమ్మక్క బ్యారేజీతో కొత్త అడ్డంకులు
34,622 ఎకరాల లక్ష్యంలో పెండింగ్ భూసేకరణ
సాగునీటి కల నెరవేరని వైనం

Devadula Irrigation Project Land Acquisition Delay | ఉమ్మడి వరంగల్, ఆంధ్రప్రభ బ్యూరో: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2002లో రాష్ట్ర భారీ నీటిపారు ద ల శాఖ మంత్రిగా ఉన్న కడియం శ్రీహరి కంతనపల్లి ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా దేవాదుల ప్రాజెక్టును నిర్మించాలని అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సూచించారు. ఒకవైపు వర్షాలు కురుస్తుం డగా, దేవాదులకు వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవ డంతో ప్రత్యేక హెలిక్యాప్టర్లో తాపీ మేస్త్రీని తీసుకెళ్లి తుపాకులగూడెం వద్ద దేవాదుల ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు.

ప్రాజెక్టును ప్రారంభించి పాతిక సంవత్సరాలు గడిచిపోయినా.. ఇప్పటివరకు ప్రాజెక్టు కు అవసరమైన భూసేకరణ పూర్తికాలేదు, ఇది ఒక ఆందోళనకర పరిస్థితిగా మారింది. 38 టీఎం సీల గోదావరి జలాలను వినియోగించుకొని ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు పక్కనే ఉన్న సిద్దిపేట జిల్లా, సూర్యాపేట, యాదాద్రిభువనగిరితో పాటు కరీంనగర్ జిల్లాలో కొంతమేరకు దేవాదుల ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించాలని నిర్దేశించుకున్నారు.

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గంగారం వద్ద దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించిన పంప్ హౌస్ ను నిర్మించి, మూడు దశల్లో ప్రాజెక్టును పూర్తిచేసి 6 లక్షల 21 వేల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ఏర్పాటుచేశారు.

గంగారం వద్ద నిర్మించిన దేవాదుల పంప్ హౌస్కు 365 రోజులపాటు నీరు అందేవిధంగా తుపాకులగూడెం దిగువన సమ్మక్క బ్యారేజీని రూ. 2100 కోట్లతో నిర్మించారు. అయితే సమ్మక్క బ్యారేజీ నిర్మాణంతో మహారాష్ట్రలో కొంత భూమి ముంపునకు గురవుతుండటంతో ఆ ప్రాజెక్టు వినియోగానికి పూర్తి స్థాయిలో అనుమతులు రాలేదు. ఇది ప్రాజెక్టుకు మరో ముఖ్య అడ్డంకిగా మారింది.

మహారాష్ట్ర నుంచి ఎన్ సీ వస్తేనే కేంద్ర ప్రభుత్వం సమ్మక్క బ్యారేజీ వినియోగానికి అనుమతులు ఇవ్వనున్నది.

34,622 ఎకరాల భూసేకరణ

ప్రాజెక్టు కోసం 34,622 ఎకరాల భూమిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటిదశలో 2632 ఎకరాల భూమిని సేకరించి ప్రాజెక్టుకు సంబంధించిన ప్రధాన పనులను పూర్తిచేశారు. మొదటి దశలోనే ప్యాకేజీ 45 కింద 1536 ఎకరాలు, ప్యాకేజీ 46 కింద 1668 ఎకరాల భూమిని సేకరించారు.

రెండోదశ కింద ప్రధాన పనులకు 6,075 ఎకరాల భూమిని సేకరించారు. స్టేషనఘన్పూర్ రిజర్వాయర్తో పాటు దాని కింది ప్రధాన కాలువల నిర్మాణానికి 2095 ఎకరాల భూమిని సేకరించారు.

ఏఆర్ఎంసీ, సీఆర్ఎంఎసీ కింద 86 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉన్నది. స్టేషనన్పూర్ నుంచి తపాసుపల్లి రిజర్వాయర్ కోసం ఇంకా 644 ఎకరాలు, మూడవ దశలో ప్యాకేజీ-2 కింద 9 ఎకరాలు, ప్యాకేజీ-5 కింద 148 ఎకరాలు, ప్యాకేజీ-6 కింద 1292 ఎకరాలు, ప్యాకేజీ-7 కింద 126 ఎకరాలు, ప్యాకేజీ-8 కింద 64 ఎకరాలు సేకరించాల్సి ఉంది.

మొత్తం ప్రాజెక్టు కింద 34,622 ఎకరాలు సేకరించాల్సి ఉండగా ఇంకా 2659 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది.