గిరిజన గ్రామాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం
గిరిజన గ్రామాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం
- ఎమ్మెల్యే వెడమ బొజ్జు
కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని అల్లంపల్లి బాబా నాయక్ తండ జిపి పరిధిలో గల నేలకుని ఉన్న పలు ప్రధాన సమస్యలను పరిష్కరిస్తామని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవ్యష్ మిశ్రా ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ బొజ్జు పటేల్ అన్నారు. గురువారం కడెం మండలంలోని అల్లంపల్లి గ్రామంలో అల్లంపల్లి బాబా నాయక్ తండ జిపి పరిధిలోగల ప్రజలతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి నిర్మల్ జిల్లా కలెక్టర్ భవ్యష్ మిశ్రా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు నిర్మల్ డిఎఫ్ఓ సుశాంత్ సుఖదేవ్ బొబడే నిర్మల్ డి ఆర్ డి ఓ విజయలక్ష్మి డిపిఓ శ్రీనివాస్ డి ఎం హెచ్ ఓ డాక్టర్ రాజేందర్ లు హాజరయ్యారు.
ఈ సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు మాట్లాడుతూ.. అల్లంపల్లి గ్రామానికి మంజూరైన రోడ్డు ఆటవిశాఖ అనుమతి లేక రోడ్డు నిర్మాణ పనులు జరగకపోవడం వల్ల రాకపోకలకు చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తమకు అటవీ శాఖ నుండి రోడ్డు నిర్మాణానికి అనుమతి ఇప్పించాలని కోరారు అలాగే ప్రభుత్వం నుండి అర్హులైన పేద లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ పథకం ఇండ్లను నిర్మాణం చేపట్టకుండా ఫారెస్ట్ శాఖ అధికారులు తమ ఆటవి భూమి అంటూ అడ్డంకులు పెడుతున్నారని ఈ విషయంపై కూడా తమకు న్యాయం చేయాలని కోరారు అలాగే అల్లంపల్లిలో హెల్త్ సబ్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని కోరారు .
ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ బొజ్జు పటేల్ మాట్లాడుతూ అల్లంపల్లి గ్రామానికి నూతన రోడ్డును మంజూరు చేస్తామని పై రోడ్డు నిర్మాణానికి అలాగే ఆట విశాఖ అనుమతి ఇప్పిస్తామన్నారు అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం కూడా అటవీశాఖ అనుమతి ఇప్పిస్తామని అలాగే హెల్త్ సబ్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తామని అల్లంపల్లి బాబా నాయక్ తండ గ్రామాలలో నెలకొని ఉన్న సమస్యలను మరియు ఆటవి సమస్యలను పరిష్కరిస్తామన్నారు అల్లం పల్లి గ్రామంలో దొంగ భూమి పట్టాలు పొందిన వ్యక్తులపై ప్రత్యేక విచారణ జరిపించి అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పీ భూషణ్ నిర్మల్ డిసిసి ప్రధాన కార్యదర్శి పి సతీష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కడం మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న కడెం మండల తహసిల్దార్ కాజా మొయినుద్దీన్ ఎంపీడీవో అరుణ ఉడుంపూర్ ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరెడ్డి సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు జొన్నల చంద్రశేఖర్ ఆర్టిఏ నెంబర్ తుమ్మల మల్లేష్ అల్లంపల్లి బాబా నాయక్ తండ గంగాపూర్ రాణి గూడ కుర్ర తండా ఉడుంపూర్ ఇస్లాంపూర్ గ్రామాల సర్పంచులు తోడసం కాంత ఎం సునీత వెడమ జంగు తోడసం సీతారాం ఎం విజయలక్ష్మి జొన్నల చంద్రశేఖర్ కోమటి వెంకటి మాజీ ఎంపిటిసి దాసు నాయక్ మండల స్థాయి ప్రభుత్వ శాఖల అధికారులు స్థానిక పంచాయతీ కార్యదర్శులు బి మనోజ్ వంశీకృష్ణ వినోద్ కుమార్ సుధాకర్ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. బుల్లెట్ బైక్ పై పర్యటించి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే కలెక్టర్ కడెం మండలంలోని మారుమూల అటవీ రోడ్డు సౌకర్యం లేని గ్రామాలకు గురువారం సాయంత్రం ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ బొజ్జు నిర్మల్ జిల్లా కలెక్టర్ భవ్యష్ మిశ్రా బైక్ పై పర్యటించారు గ్రామాల్లో పలు సమస్యలను అక్కడి గ్రామ ప్రజలు విద్యుత్తు రోడ్ల నిర్మాణం ఇందిరమ్మ ఇల్లు తదితర సమస్యలపై వారి దృష్టికి తీసుకురాగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు
బుల్లెట్ బైక్పై మారుమూల గ్రామాల పర్యటన
అనంతరం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా కడెం మండలంలోని రోడ్డు సౌకర్యం లేని మారుమూల అటవీ గ్రామాలైన మిద్దచింత, ఇస్లాంపూర్ తదితర ప్రాంతాల్లో బుల్లెట్ బైక్పై పర్యటించారు. గ్రామాల్లో విద్యుత్, రోడ్లు, ఇందిరమ్మ ఇళ్లు, తాగునీరు వంటి సమస్యలను గ్రామస్తులు వారి దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
