20 మందిపై కేసులు
20 మందిపై కేసులు
- జన్నారం ఎఫ్‌డీఓ రామ్మోహన్
జన్నారం, ఆంధ్రప్రభ : పాలగోరి ఆక్రమణదారులందరూ భూములున్నవారేనని మంచిర్యాల జిల్లా జన్నారం ఎఫ్‌డీఓ ఎం. రామ్మోహన్(M. Rammohan) తెలిపారు. స్థానిక ఎఫ్‌డీఓ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఉమ్మడి జిల్లాలోని కవ్వాల టైగర్( Kavwala Tiger) రిజర్వ్ జన్నారం అటవీ డివిజనల్ ఇందనపల్లి ఫారెస్ట్ రేంజ్(Forest Range) కవ్వాల ఫారెస్ట్ సెక్షన్ పరిధిలోని పాలగోరి(Palagori) అటవీప్రాంతంలో కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ (యు), జైనూర్, లింగాపూర్ మండలాల నుంచి 60 మంది ఆదివాసీలు వచ్చి ఈనెల 4న, 18న అడవిని ఆక్రమించుకొని చెట్లు నరికినందుకుగానూ, ఆత్రం రాజుతోపాటు 26 మందిపై వైల్డ్ లైఫ్, ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగిందన్నారు.
వీటితోపాటు గతంలో 3సార్లు అడవిలోకి అక్రమంగా ప్రవేశించి చెట్లు నరికిన మరో 20 మందిపై కేసులు(Cases) పెట్టడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. వీరందరికీ తమ తమ నివాస గ్రామాల్లో ఒక్కొక్కరి పేరుపై 2 నుంచి 10 ఎకరాల వరకు లావణి, ఆర్ఓఎఫ్ఆర్(ROFR) పట్ట భూములు ఉన్నాయని, వారందరిపై తమ అటవీశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యల కోసం సంబంధిత జిల్లా కలెక్టర్లకు, ఉట్నూర్ ఐటీడీఏ పీఓ(Utnoor ITDA PO)కు పూర్తి ఆధారమైన వివరాలతో నివేదికను పంపించనున్నట్లు ఆయన తెలిపారు.
పాలగోరి(Palagori) ప్రాంతం పూర్తిగా కవ్వాల టైగర్ రిజర్వ్ లోని కోర్ ఏరియాలో ఉందని, ముమ్మాటికి ఆ భూమి అంతా అటవీ భూమేనని ఆయన స్పష్టం చేశారు.
